హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు చంద్రగిరి నుండి పారిపోయారు: జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు వెన్నుపోటి పొడిచి అధికారం లాక్కున్న బాబు... జగన్‌కు అధికార దాహముందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు కాలం చెల్లిన రాజకీయ నాయకుడు అన్నారు. జగన్ నీలా వైస్రాయ్ రాజకీయాలు నడపలేదని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలోనే బాబు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే బాబు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాని ఆపగల్గే వారా అని ప్రశ్నించారు.

చంద్రగిరి ప్రజలు తరిమేస్తే చంద్రబాబు కుప్పం చేరుకున్నారన్నారు. ఓటమికి భయపడే చంద్రగిరి నుండి పారిపోయారన్నారు. చంద్రబాబు నిత్యం తాను ఆస్తులు ప్రకటించానని చెప్పుకుంటున్నారని, ఆసలు ఆయన ప్రకటించిన ఆస్తులు నిజమేనా అని ప్రశ్నించారు. ప్రకటించిన ఆస్తులు నిజమే అయితే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన స్టే ఎందుకు తెచ్చుకున్నావన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే నీ ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని బాబుకు సవాల్ విసిరారు. బాబు పెద్ద అబద్దాల కోరు అన్నారు. మనుషుల్నే శవాల్ని చేసి రాజకీయాలు చేసే చరిత్ర బాబుది అన్నారు.

English summary
YSR Congress Party leader Gattu Ramachandra Rao challenged TDP chief Nara Chandrababu Naidu about his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X