మద్యం కేసులో బాబుకు, మంత్రులకు హైకోర్టు ఊరట

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాలలో ప్రభుత్వం తీరుపై ప్రశ్నించింది. యథేచ్ఛగా ఇసుక తవ్వడం వల్ల నదీ ప్రవాహాల గతి తప్పి నదుల దిశలు మారుతున్నాయని హైకోర్టు పేర్కొంది. వీటి వల్ల సునామీలు, తుఫాన్లు వస్తున్నాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పేర్కొంది. విచ్చలవిడిగా తవ్వకాలు జరిపడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే పరిస్థితి వస్తోందన్నది. ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించింది. జాతి సంపదకు నష్టం చేకూరుస్తున్న టెండర్ల విధానం మార్చాలన్నారు. ఇసుక తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్ నెల 2వ తేది లోగా నివేదిక సమర్పిస్తామని అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications