తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిమ్కాబుక్‌లో గల్లాకు చోటు,జయదేవ్ సిద్ధమన్న మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
న్యూఢిల్లీ: మంత్రి గల్లా అరుణ కుమారి అరుదైన రికార్డు సాధించారు. భర్త గల్లా రామచంద్రయ్య నాయుడుతో కలిసి ఆమెఆదివారం ఎపి భవన్‌లో ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. ఒకే రోజు 103 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కాను ఈమె పేరు లిమ్కా బుక్‌లో రికార్డ్ అయింది. గతంలో ఈ రికార్డు కేంద్ర మంత్రి శరద్‌పవార్ పేరున ఉంది. ఆయన ఒకే రోజు 60 గ్రామాల్లో ప్రచారం చేశారు. అయితే 2009 సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అరుణ తన విస్తృత ప్రచారం చేశారు. ఆ ఏడాది ఏప్రిల్ 19న ఒకేరోజు 103 గ్రామాల్లో ఆమె సుడిగాలి పర్యటన జరిపారు. ఉదయం 7.40 నిమిషాలకు చంద్రగిరిలో ప్రారంభమైన ఆమె ప్రచారం.. ప్రతి గ్రామంలో సగటున మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ప్రసంగిస్తూ రాత్రి 8.40 గంటలకు ఆవిలాల గ్రామంలో ముగిసింది. ఈ క్రమంలో దాదాపు 21 వేల మంది ఓటర్లను ఆమె కలిశారు. ఈ ప్రచారమే లిమ్కా రికార్డుల్లోకి చేరింది.

అయితే ఈ గుర్తింపు తన కుమారుడు జయదేవ్‌కే దక్కుతుందని, ఆయనే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చూసుకున్నారని మంత్రి అరుణ అవార్డు అందుకున్న సందర్భంగా తెలిపారు. కేంద్ర మంత్రి పళ్లం రాజు ఆమెను అభినందించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు జయదేవ్ సిద్ధంగా ఉన్నాడని అరుణ తెలిపారు. అయితే సీటు కోసం తాను ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అందుకోసం ఎవరినీ కలవలేదని ఆమె తెలిపారు. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉగాది వేడుకల్లో పాల్గొనడానికి, లిమ్కా రికార్డు అందుకోవడానికే తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. తిరుపతిలో పోటీ తీవ్రంగా ఉంటుందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చంద్రగిరి కంటే తీవ్రమైన పోటీ ఉండే నియోజకవర్గం మరేదీ ఉండబోదన్నారు. తిరుపతిలో అభ్యర్థి తన కొడుకైనా మరెవరైనా కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 40 వేల మెజారిటీ దక్కడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానానికి, చిరంజీవికి, ముఖ్యమంత్రికి ఆమోదయోగ్యుడైన వ్యక్తి ఎవరు పోటీ చేసినా గెలిపిస్తామన్నారు.

English summary

 Minister Gall Aruna Kumari said that his son is ready to contest from Tirupati constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X