వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభను నడవనివ్వం, ప్రధాని ఉన్నాడా: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢల్లీ: తెలంగాణపై స్పందించేవరకు లోకసభను జరగనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. లోకసభను ఈ రోజు స్తంభింపజేశామని, వరుసగా తాము స్తంభింపజేస్తామని, ఏం చేస్తారో చూస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చెవిటి, గుడ్డి, మూడ ప్రభుత్వంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభివర్ణించారు. ఇంత మంది ఆత్మత్యాగాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అసలు దేశానికి ప్రధాని ఉన్నాడా, లేడా అని ఆయన అడిగారు.

గుండెలు అవిసేలా అరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు. అత్మహత్యలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇదే వైఖరి కొనసాగితే అసహజ పరిణామాలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. చేతులు జోడించి యువతకు విజ్ఝప్తి చేస్తున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ వచ్చే వరకు పోరాడుదామని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు గొడవలు లేవు, హింస లేదు, ఉప ఎన్నికలు కూడా జరిగాయని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రశాంత వాతావరణం కాదా అని ఆయన అన్నారు. తెలంగాణపై స్పందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు.

English summary
TRS president K Chandrasekhar Rao said that his party will continue to stall Loksabha prosedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X