వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై రాజ్యసభలో కేంద్రంపై కేశవరావు నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను పరిష్కరించకపోవడంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడంపై ఆయన సోమవారం రాజ్యసభలో నిలదీశారు. కేశవరావు మాట్లాడుతున్న సమయంలో బిజెపి సభ్యుడు జవదేకర్ శ్రద్ధగా విన్నారు. కేంద్రంపై విమర్శలు చేసినప్పుడు సిగ్గు సిగ్గు అంటూ బిజెపి సభ్యులు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏడు వందల మంది బలిదానాలు జరిగాయని, తెలంగాణ ఇవ్వడానికి మరెంత మంది బలి కావాలని, వేయి మంది మరణిస్తే తెలంగాణ ఇస్తారా అని కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజలు మనుషులు కారా అని ఆయన అడిగారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో కాంగ్రెసు అధిష్టానానికి అర్థమవుతోందా అని ఆయన అడిగారు. తమను చంపేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే చంపేయాలని ఆయన ఆవేశంగా అన్నారు. మానసికంగా రాష్ట్రం ఎప్పుడో విడిపోయిందని ఆనయ అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశాంతత గురించి మాట్లాడుతున్నారని, ప్రధాని చెప్తేనే సకల జనుల సమ్మెను విరమించామని ఆయన అన్నారు.

తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విషయాన్ని మరిచిపోయారా అని ఆయన అడిగారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయడానికి అఖిల పక్ష సమావేశం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన అడిగారు. తెలంగాణపై కమిటీ వేశారని, అయినా ఏమీ కాలేదని ఆయన అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం రాజీనామ చేశారని ఆయన గుర్తు చేశారు. కొద్ది రోజుల్లో కేశవరావు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తోంది. తిరిగి ఆయనను కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేయలేదు.

English summary
KK fires at Union Government on Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X