వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుటిగా హైదరాబాద్ సమస్య వద్దు:దానంతో సోనియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - Danam Nagendar
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం అనే కొత్త సమస్యను సృష్టించ వద్దని తమకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని మంత్రి దానం నాగేందర్ సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఆయన సోనియా గాంధీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము కేంద్ర పాలిత ప్రాంత అంశం సోనియా దృష్టికి తీసుకు వెళ్లామని అయితే ఇప్పటికే సమస్యలు ఉన్నాయని కొత్తగా ఆ సమస్య సృష్టించ వద్దని తమకు హితవు పలికారన్నారు. తెలంగాణపై తాము సోనియాతో చర్చించలేదన్నారు. ఈ విషయంలో తాము అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. గతంలోనూ ఇదే తాను చెప్పానన్నారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా అందుకు తాము సిద్ధమన్నారు. కాంగ్రెసు పార్టీకి ఎవరు త్రెట్ కాదన్నారు. కాంగ్రెసుకు కార్యకర్తలే ప్రధాన బలం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మాత్రం గ్రేటర్‌గా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.

ఉప ఎన్నికల ఓటమితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదన్నారు. రెఫరెండం అనడం, వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఓటమిపై సమీక్షించి లోపాలు సరిదిద్దుకుంటామన్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కొవూరులో ఏం జరిగిందనేది తనకు తెలియదన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆమెకు వివరించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా తన పని తీరు అడిగారన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయలోపంపై నివేదిక ఇచ్చామన్నారు. వచ్చే పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలపై దృష్టి సారించాలని ఆమె తమకు సూచించారని చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

English summary
AICC president Sonia Gandhi suggested minister Danam Nagendar that do not create new issue on Telangana with UT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X