హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు తెలంగాణ బంద్: బిజెపి, టిటిడిపి మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి, సోమవారం ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి మంగళవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. తెరాస తెలంగాణ బంద్ పిలుపుకు భారతీయ జనతా పార్టీ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ నగారా సమితి, తెలంగాణ టిడిపి మద్దతు పలికింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యల కారణంగా మరో తెలంగాణ బిడ్డ ఆత్మత్యాగం చేశారని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల వైఖరి వల్లే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సభలో ఆత్మత్యాగాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మంగళవారం బంద్ ఉన్నప్పటికీ విద్యార్థుల పరీక్షల దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసి బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. మంత్రి డికె అరుణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సీమాంధ్ర ఎంగిలి మెతుకుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అమరులకు సభలో నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలన్నారు.

తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీ వెనక్కి తీసుకున్నందువల్లే తెలంగాణలో ప్రాణత్యాగాలు కొనసాగుతున్నాయని బిజెపి ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేయవద్దని పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడదామని సూచించారు. ఆత్మత్యాగాలు కాకుండా పోరాడి తెలంగాణ సాధించుకుందామన్నారు. ఇంతమంది చచ్చిపోతుంటే అసెంబ్లీ ఎందుకని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ఆంధ్రోళ్ల అడుగులకు మడుగులొత్త వద్దని సూచించారు. ఇన్నాళ్లకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నోటి నుండి తెలంగాణ అన్న పదం వినిపించిందని అన్నారు. అధికార, ప్రతిపక్షాలకు బాధ్యత లేకుంటే సభ నుండి వెళ్లి పోవాలని అన్నారు. కాగా కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దని సూచించారు. మంగళవారం నాటి బందుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

English summary
TRS called to Telangana bandh on tuesday. BJP and Nagam Janaradhan Reddy supported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X