హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై చంద్రబాబుకు ఎందుకంత కోపం వచ్చింది?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిప్పులు చెరిగారు. ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా సాధారణంగా చంద్రబాబు ముఖకవళికలు మారవు, కంఠస్వరం హెచ్చుతగ్గులుండవు. కానీ సోమవారం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన సందర్భంలో ఆయన తీవ్ర ఆవేశానికి గురైనట్లు కనిపించారు. పైగా, మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. నువ్వు అని సంబోధిస్తూ జగన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఇంతగా జగన్‌పై చంద్రబాబుకు కోపం రావడానికి గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో ఆదివారం సాయంత్రం వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.

త్వరలో రానున్న ఉప ఎన్నికల కోసం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మధ్య ఎప్పుడో లోపాయికారి ఒప్పందం కుదిరిందని జగన్ ఆరోపించారు. ప్రత్తిపాడు, ఎమ్మిగనూరు, పాయకరావుపేట, అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడికి వదిలేసి వాటిలో కాంగ్రెసు పార్టీ బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపేలా ఒప్పందం కుదిరిందని ఆయన అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు డబ్బును వెదజల్లి, ప్రజల ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మగౌరవాన్ని వేలం వేసి కొనేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబుతో కాంగ్రెసు నాయకులు కమ్మక్కయ్యారని చెప్పడానికి కొన్ని ఉదంతాలను ఆయన చెప్పుకొచ్చారు. రెండు ఎకరాల భూమి కలిగిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్లు సంపాదించారని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has fired at YSR Congress president YS Jagan in response to later's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X