టిడిపిలో తెలంగాణ చిచ్చు: చంద్రబాబుపై ఒత్తిళ్లు?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో తెలంగాణ చిచ్చు రగులుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర విభజనను అడ్డుకోమని ఇప్పటికే చెబుతున్న దృష్ట్యా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తే బాగుంటుందని తెలంగాణ టిడిపి నేతలు బాబుకు సూచిస్తున్నారట. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాస్తేనే తెలంగాణ ప్రాంతంలో పార్టీ బతికి బట్ట కడుతుందని లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారట. తెలంగాణ కోసం నిత్యం బందులు, ధర్నాలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పక పోవడంతో తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, ప్రజల్లో కూడా తిరగలేక పోతున్నామని బాబు వద్ద వాపోయారని అంటున్నారు. తెలంగాణ వేడి ఉన్న ఈ సమయంలోనే కేంద్రానికి లేఖ రాస్తే తెలంగాణలో టిడిపికి పునర్వైభవం వస్తుందని చెబుతున్నారని తెలుస్తోంది. తాము ఇంత చెబుతున్నప్పటికీ చంద్రబాబు లేఖ రాస్తారా లేదా అనే గుబులు తెలంగాణ టిడిపి నేతలలో ఉందని తెలుస్తోంది.

తెలంగాణ నేతల వాదనతో సీమాంధ్ర నేతలూ ఏకీభవిస్తున్నారని అంటున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాము అడ్డుకోమని బాబు కేంద్రానికి లేఖ రాస్తే తెలంగాణలో టిడిపి బలపడుతుందని తద్వారా సీమాంధ్రలోనూ పార్టీకి లబ్ధి చేకూరుతుందని వారు భావిస్తున్నారట. అయితే ఇదే విషయాన్ని బాబు వద్ద ప్రస్తావించేందుకు ముందుకు రావడం లేదట. బాబు లేఖ రాస్తే తెలంగాణ భారం కేంద్రం పైనే పడుతుందని వారు భావిస్తున్నారట. అప్పుడు టిఆర్ఎస్, బిజెపిలకు తమను ప్రశ్నించలేదని వారు భావిస్తున్నారట. ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇచ్చినా లేఖ రాసినందు వల్ల తెలంగాణలో టిడిపి బలపడి ఇటు సీమాంధ్ర అటు తెలంగాణలో టిడిపి ఆధ్వర్యంలోనే ప్రభుత్వాలు ఏర్పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు రెండో దశ ఉప ఎన్నికల తర్వాత ఈ విషయంపై ఆలోచించుదామని మరికొందరు నేతలు సూచిస్తున్నారట.

కాగా ఇప్పటికే వేణుగోపాల చారి, హరీశ్వర్ రెడ్డి పార్టీ వీడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బాబు లేఖ రాయకుంటే మరికొందరు నేతలు పార్టీని వీడే అవకాశముందని తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఫోరం కన్వీనర్ పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేయగా దానిని బాబు తిరస్కరించారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఫోరం కన్వీనర్ పదవితో పాటు శాసనసభ్యత్వానికి, పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎర్రబెల్లి మాత్రం రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+