టిడిఎల్పీకి హరీష్‌రావు, సిఎం వైపు దూసుకెళ్లిన నాగం

కాగా సభలోనూ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి వైపు ఒక్కసారిగా దూసుకు పోయారు. తెలంగాణపై తీర్మానం పెట్టే కనికరం లేదా అని సిఎంను నిలదీశారు. మానవత్వంతో మెలగాలని సిఎంకు సూచించారు. నాగం ఒక్కసారిగా సిఎం వైపు దూసుకు రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా తెలంగాణ తీర్మానం కోసం పట్టుబడుతున్న బిజెపి, తెరాస, నాగం ఆ తర్వాత బెట్టి వీడి స్పీకర్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications