వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్ మాట వినలేదు, వినబోం: కాంగ్రెసు టి - ఎంపిలు

By Pratap
|
Google Oneindia TeluguNews

T Rajaiah - Manda Jaganadh
న్యూఢిల్లీ: లోకసభ సజావుగా సాగడానికి సహకరించాలని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన సూచనను తాము తిరస్కరించామని, ఇక ముందు కూడా తిరస్కరిస్తామని, తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు లోకసభ సమావేశాలను అడ్డుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని బలరాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు దురదృష్టకరమైన పరిణామమని సిరిసిల్ల రాజయ్య అన్నారు. తాము ఆజాద్ మాట వినకుండా లోకసభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమైక్యవాదులు అడ్డుపడవద్దని, అలా అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణను సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు వద్దని, పోరాడి తెలంగాణను సాధించుకుందామని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

రేపు మరోసారి తమతో మాట్లాడుతామని ఆజాద్ చెప్పారని రాజయ్య అన్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపులు, సబ్ గ్రూపులు ఏర్పాటు చేసి కాంగ్రెసు పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశం మరుగునపడిందని, రెండు సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణపై వాయిదాలు పెడుతున్నారని, వాయిదాలు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో కాంగ్రెసుపై నమ్మకం సన్నగిల్లుతోందని, అందుకే ఆరు స్థానాల్లో కూడా కాంగ్రెసు ఓడిపోయిందని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణపై తేల్చే వరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించాలని తాము ఆజాద్‌ను కోరినట్లు వివేక్ చెప్పారు.

English summary
Congress Telangana MPs said that they will not allow Loksabha to run, till steps to be tajen to resolve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X