దోషులు బయట ఉన్నారు, కుట్ర చేయలేదు: ఆచార్య

ఎమ్మార్ విషయంలో ప్రభుత్వ వాటా ఇప్పటికీ సరిగానే ఉందని ఆయన చెప్పారు. తనను కావాలనే కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని, కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్ారు. తన సర్వీసులో ఎప్పుడూ లంచం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ బెయిల్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది.












Click it and Unblock the Notifications