శ్రీలక్ష్మి బినామీ మరిదే: దృష్టి సారించిన సిబిఐ

ఇదే కేసులో అధికారులు తమను వేధిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటేశ్వరరావు, మెహదీపట్నానికి చెందిన ఎన్.మధుసూదన్‌రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాకేశ్ బాబు చాలాకాలం నుంచి తమకు తెలుసని, ఆయన తమ వద్ద నుంచి రూ.44.25 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేశారని, ఆ డబ్బు శ్రీలక్ష్మిదేనని చెప్పాల్సిందిగా సీబీఐ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పిటిషన్లలో పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అసుతోష్ మొహంతా పిటిషనర్లను ప్రశ్నించడానికి సీబీఐకి అనుమతిచ్చారు. వారిపై ఒత్తిడి తేవద్దని, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications