ఇండిపెండెంట్‌గా కొండా సురేఖ పోటీ, జగన్ వైఖరి వల్లే?

వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో మంత్రి పదవికి, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని సురేఖ చెబుతున్నారు. అయితే, ఆమె వాదనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యతిరేకిస్తోంది. తెలంగాణపై వైయస్ జగన్ స్పష్టత ఇచ్చి, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తేనే కొండా సురేఖకు మద్దతు ఇస్తామని తెరాస నాయకులు అంటున్నారు. తెరాస కూడా ఈ స్థానంలో పోటీకి సిద్ధపడుతోంది. మహబూబ్‌నగర్ విజయంతో ఊపు మీదున్న బిజెపి కూడా పోటీకి సిద్ధమని కయ్యానికి కాలు దువ్వుతోంది. గతంలో బిజెపి ఈ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించింది. పాత బలంతో, కొత్త తెలంగాణ నినాదంతో విజయం సాధిస్తామనే ధీమాతో బిజెపి ఉంది.
కాగా, తెలంగాణ నినాదంతో డిఎస్పీ పదవిని కోల్పోయిన నళిని కూడా తాను పోటీ చేస్తానని అంటోంది. తెలంగాణ జెఎసి మద్దతును ఆమె కోరింది. పరకాల పోటీ చేసేందుకు తనకు మద్దతు ఇవ్వాలని ఆమె తెలంగాణ జెఎసి నేత కోదండరామ్‌ను కలిసి కోరింది. ఎలాగూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారు. అయితే, కొండా సురేఖ మాత్రం ఇప్పటి నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఆమె తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆమెకు తెరాస ఎప్పటికప్పుడు కౌంటర్ వేస్తూనే ఉంది.












Click it and Unblock the Notifications