లోకసభలో తెలంగాణ లొల్లి: ఎంపీలకు సుష్మా మద్దతు

Sushma Swaraj
న్యూఢిల్లీ: లోకసభలో మూడో రోజూ తెలంగాణ అంశంపై గందరగోళం చెలరేగింది. తెలంగాణ అంశం పైన బుధవారం రెండు సార్లు సభ వాయిదా పడింది. ఉదయం లోకసభ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కె చంద్రశేఖర రావు, విజయశాంతిలు జై తెలంగాణ అంటూ సభలో నినాదాలు చేశారు. తెలంగాణ విషయాన్ని వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరుగుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు తెచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు. ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ సమయంలో కెసిఆర్, విజయశాంతిలు వెల్‌లోకి దూసుకు పోయారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.

అ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. అయితే ఎంపీలు మాత్రం మళ్లీ తెలంగాణ కోసం పట్టుబట్టారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకు పోయారు. ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తొలిసారి వెల్‌లోకి దూసుకు పోయారు. తెలంగాణపై తేల్చాలని పట్టుబట్టారు. భారతీయ జనతా పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రాంత ఎంపీలకు మద్దతుగా నిలిచారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఒక్కో ఎంపీకి మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయం కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ మరోసారి సభను రెండు గంటలకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+