ఏడుపు మొహాలే: నాగంకు టిడిపి అన్నపూర్ణమ్మ షాక్

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లను ఎవరిని చూసినా ఏడుపు ముఖాలే కనిపిస్తున్నాయన్నారు. ఎంత దాచుకుందామన్నా మీ ముఖంలోనూ ఏడుపు కనిపిస్తుందని, అందుకే టిడిపిలోనే ఉండాలని నిర్ణయించుకున్నామని, టిడిపిలో ఉన్నప్పుడు మీ మొహాలు ఆనందంగా ఉండేవని, ఇప్పుడు మాత్రం చిరాకుగా మాడిపోయి కనిపిస్తున్నాయన్నారు. కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత ఈటెల రాజేందర్‌తో కలిసి బయటికి వచ్చిన నాగం, లోపలే ఉన్న తమ వర్గం ఎమ్మెల్యే వేణుగోపాలా చారిని ఉద్దేశించి.. టిఆర్ఎస్‌లో చేరి పోవయ్యా అని నవ్వూతూ అన్నారు. అక్కడే ఉన్న విలేకరులు.. మీరిద్దరూ చేరితే టిఆర్ఎస్ వెయిట్ పెరుగుతుంది కదా అని ప్రశ్నించగా అందుకు నాగం.. వేణుగోపాల చారి ఒక్కడు చేరితేనే టిఆర్ఎస్ వెయిట్ సగం పెరుగుతుంది, ఇక నేను కూడా చేరితే వెయిట్ బాగా పెరిగి వాళ్లు సైడ్ అవుతారని చమత్కరించారు.