హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నందమూరి ఫ్యామిలీదే: హరికృష్ణ, టార్గెట్ బాబే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hari Krishna
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుల వల్ల తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. పార్టీని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తల పైనే ఉందని అన్నారు. అయితే నాయకుల వల్లనే పార్టీ ఇబ్బందుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించడంతో ఆయన తన బావ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారా అన్న అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ ముప్పయ్యవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం పార్టీలోనూ చర్చనీయాంశమైందని తెలుస్తోంది. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకుల వల్లనే టిడిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. పార్టీని కార్యకర్తలే కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. నేతలు కార్యకర్తలను విస్మరించవద్దన్నారు.

నాయకుల వల్లనే పార్టీ నీరసపడిందన్నారు. పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అన్నగారి పార్టీని మళ్లీ ప్రజలు అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు పల్లకిలో కూర్చుంటామంటే ఇక మోసే వారెవరని ఆయన ప్రశ్నించారు. పని చేయని నాయకుడిని నిలదీయాలన్నారు. ఇది కార్యకర్తల పని అన్నారు. ఈ పార్టీ ఎన్టీఆర్ మానస పుత్రిక అని, పార్టీలో ఎలాంటి లోపం లేదన్నారు. ఎన్టీఆర్‌కు ఎవరో చెబితే, ఎవరో నేర్పితే వచ్చిన పార్టీ కాదన్నారు. మూడువందలకు పైగా సినిమాల్లో నటించి ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం పార్టీని స్థాపించారన్నారు. తెలుగుదేశం నందమూరి కుటుంబానిదేనని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరమైన సమయంలో టిడిపికి సేవలందిస్తారన్నారు. ఎన్టీఆర్‌కు ఇంకా రాజకీయ అనుభవం కావాలన్నారు. మమ్మల్ని బయటకు పంపేంత వరకు టిడిపికి సేవ చేస్తామన్నారు. పార్టీని బతికించుకోవాల్సి ఉందన్నారు. ఓ వైపు కాంగ్రెసు పార్టీ నేతలతో కొందరు నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని విమర్సించారు. కాంగ్రెసుతో చేసే వ్యాపారాలను పార్టీ అధినేతలు అడ్డుకోవాలన్నారు. కాగా టిడిపి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందన్న జగన్ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.

కాగా చంద్రబాబుపై పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ బుధవారం మరోసారి అలిగిన విషయం తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తికి గురైన ఆయన చంద్రబాబుపై అలిగినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) కార్యాలయం వెలుపల కూర్చుని ఆయన తన నిరనసను తెలియజేశారు. తెలుగుదేశం వ్యాపారవేత్తల పార్టీ అయిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

English summary
It seems, TDP leader Hari Krishna targetted again chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X