'వైయస్ వివేకానంద'కు మద్దతు పలికిన మైసూరారెడ్డి

తెలుగు గంగ, గాలేరు తదితర ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత తాము తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సీమ రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతమన్నారు. దీని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కాగా సీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలంటూ ఆ ప్రాంత విద్యార్థులు న్యూఢిల్లీలో రెండు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా వైయస్ వివేకా కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈయన దీక్షకు మైసూరాతో పాటు ఎస్పీవై రెడ్డి మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications