హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ నిర్దోషిత్వం తేలి ఉండేది: శోభా నాగిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Nagi Reddy
హైదరాబాద్: అవినీతి మంత్రులపై శాసనసభలో చర్చ జరిగి ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్దోషి అని తేలి ఉండేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. అవినీతి మంత్రులపై శాసనసభలో చర్చ జరగకపోవడం దురదృష్టకరమని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి శాసనసభను రాజకీయ వేదికగా వాడుకున్నాయని ఆమె విమర్శించారు. ముందు వేసుకున్న పథకం ప్రకారమే శాసనసభా సమావేశాలను ముగించారని ఆమె అన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా శాసనసభను ముగించిన ఘనత కాంగ్రెసు, టిడిపిలకే దక్కుతుందని ఆమె అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.

పరస్పరం చేక్ పెట్టుకునే ఆలోచనలు చేస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పేరుతో చంద్రబాబు పన్నిన కుట్రలో ఆయనే ఇరుక్కున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ శాసనసభలో అడుగు పెడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శాసనసభలో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చించలేదని ఆమె అన్నారు.

English summary
YSR Congress leader Shobha Nagireddy has lashed out at Congress and TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X