బాబుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు: తెరాస ఎమ్మేల్యేలు

సమైక్యవాది అయిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు మాట్లాడితే ప్రజలు నమ్మబోరని వారన్నారు. ఆంధ్రబాబును కాపాడేందుకే తెలుగుదేశం నాయకులు తెలంగాణ మంత్రం జపిస్తున్నారని వారు విమర్శించారు. తెలంగాణలో తెలుగుదేశం తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని వారు అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను గానీ తమ పార్టీని గానీ విమర్శించే స్థాయి తెలుగుదేశం నాయకులకు లేదని వారన్్నారు. తెలుగదేశం పార్టీది రెండు కళ్ల సిద్ధాంతమని, తెలంగాణ టిడిపి నాయకులను తెలంగాణవాదులంటే ప్రజలు నవ్వుతున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications