ఎమ్మార్ కేసు: విజయసాయి భార్యను ప్రశ్నించిన సిబిఐ

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడు, జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి సతీమణి సునంద రెడ్డిని సిబిఐ అధికారులు ఎమ్మార్ కేసులో గురువారం ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో ఆమె 122వ సాక్షి. బెంగళూరులోని ముఖారి ఎస్టేట్స్‌లో తాను, తన అత్తగారు డైరెక్టర్లుగా ఉన్నట్లు సునంద రెడ్డి సిబిఐకి చెప్పినట్లుగా తెలుస్తోంది. మూడేళ్లలో రూ. నాలుగు కోట్ల మేర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారని సమాచారం. 2009 మేలో చెన్నైలో జేసుదాస్ ఇంటిని రూ.80 లక్షలకు కొన్నట్లు చెప్పారని తెలుస్తోంది. 2009 మార్చిలో ఎమ్మార్‌లో రూ.75.95 లక్షలతో విల్లా స్థలం కొన్నట్లు ఆంగీకరించారని తెలుస్తోంది.

అదే సంవత్సరం అక్టోబర్‌లో బెంగళూరు ఏఎస్ఆర్ కన్ట్రక్షన్ నుండి రూ.57.72 లక్షలతో ఫ్లాట్ కొన్నామని, 2010 ఆగస్టులో చంద్రగిరిలో రూ.48.30 లక్షల విలువైన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కొన్నామని, అదే సంవత్సరం డిసెంబరులో శంషాబాదులో రూ.1.50 కోట్ల విలువైన ఐదెకరాల స్థలం కొన్నట్లు సునంద రెడ్డి తెలిపారని తెలుస్తోంది. చెన్నై గోపాలపురంలోని ఇంటిని కూతురు నేహా పేరిట కొనుగోలు చేశామని, 2002-03లో చెన్నైలో వాణిజ్య భవనం కొని అద్దెకిచ్చామని, బెంగళూరు ఔటర్ రింగ్ వద్ద ఆదర్శ్ డెవలపర్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉందని ఆమె సిబిఐ ఎదుట చెప్పారని తెలుస్తోంది.

కాగా జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎదుట గురువారం జగతి పబ్లికేషన్ ప్రతినిధులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్ కేసులో నిందితుడు బిపి ఆచార్య నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆచార్యకు శుక్రవారం వరకు రిమాండ్ విధించింది. ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆదేశించింది. అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+