కెసిఆర్‌ను ఆలింగనం చేసుకున్న ఆజాద్, సభ వాయిదా

కాగా సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని పట్టుబట్టారు. వారికి బిజెపి అగ్రనేత రాజ్ నాథ్ సింగ్, ఆర్జెడి నేత లలూ ప్రసాద్ యాదవ్ మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో గులాం నబీ ఆజాద్ పన్నెండు గంటలకు భేటీ కానున్నారని తెలుస్తోంది. తెలంగాణపై ఆందోళన చేయవద్దని వారికి సూచించే అవకాశముంది.












Click it and Unblock the Notifications