సీఎంగా విజయ్ తొలి సంతకం - ఫ్యాన్స్, మహిళలు ఫిదా..!!

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. అభిమానులకు పండగు రోజు. ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో సంచలనంగా మారిన విజయ్.. ఇప్పుడు అదే అనూహ్య పరిణామాల నడుమ ముఖ్యమంత్రి అవుతున్నారు. తన కేబినెట్ కూర్పు పూర్తి చేసారు. సభలో మెజార్టీ పూర్తి స్థాయిలో నిరూపణ తరువాత మిత్రపక్షాలకు కేబినెట్ లో అవకాశం కల్పించనున్నారు. కాగా, సీఎం గా విజయ్ తొలి సంతకం పైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఫ్యాన్స్.. మహిళలు విజయ్ నిర్ణయం తో ఖుషీ అవుతున్నారు.

విజయ్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియాన్ని ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. విజయ్‌ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కానున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లోని సినీపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా తరలిరానున్నారు. విజయ్‌ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు వీసీకే, ఐయూఎంఎల్‌ స్పష్టం చేశాయి. వీసీకే అధినేత తిరుమావళవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదన్న కారణంగానే టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము మద్దతు ఇస్తున్నట్లు ఐయూఎంఎల్‌ అధినేత ఖాదర్‌ మొహిద్దీన్‌ వెల్లడించారు.

స్టాలిన్ కనుసన్నల్లోనే : విజయ్ ప్రభుత్వం 'భవిష్యత్తు' మేమే - ప్రతిపక్షం మాదే..!!
స్టాలిన్ కనుసన్నల్లోనే : విజయ్ ప్రభుత్వం 'భవిష్యత్తు' మేమే - ప్రతిపక్షం మాదే..!!
vijay-set-to-make-vetri-payanam-his-first-signature-as-tamil-nadu-chief-minister-here-the-detail

ఎన్నికల హామీలు మొదలు.. తొలి సంతకం

కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత విజయ్ తొలి సంతకం మహిళకు ఉచిత బస్సు పథకం అమలు పైన చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి వెట్రిపయనం అనే పేరు ఖరారు చేసారు. రాష్ట్రంలోని అన్ని రకాల బస్సుల్లోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ పథకం అమలుకు సిద్దమయ్యారు. కాగా.. ఈ నెల 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని విజయ్‌ను గవర్నర్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ మద్దతు ఇస్తున్నట్లు విజయ్‌ లేఖలు అందజేసినందున ఈ నెల 13వ తేదీ లోగా అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+