విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష.. వీడియో వైరల్ !!
తమిళనాడులో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అలాగే సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌కు కూడా ఆహ్వానం పంపారు.
కాగా ఈ వేడుకలో అందరి కళ్లు మరో ముఖ్యమైన వ్యక్తి పైనే ఉన్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి త్రిష. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే త్రిష - విజయ్ వ్యవహారం జోరుగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే ప్రమాణ స్వీకారానికి కూడా రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కాగా విజయ్ - సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని జోరుగా చర్చ నడుస్తోంది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు విజయ్ కేబినెట్‌లో శాఖల కేటాయింపు ఇదేనని చెబుతున్నారు.
సీఎం విజయ్ - హోం, ప్రజాపాలన శాఖలు
ఆధవ అర్జున్ - క్రీడలు, ఎక్సైజ్ శాఖ
సెంగొట్టాయన్ - పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)
వెంకట్రామన్ - పాఠశాల విద్యాశాఖ
ఎన్. ఆనంద్ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
CTR నిర్మల్ కుమార్ - విద్యుత్ శాఖ
రాజమోహన్ - ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
అరుణ్ రాజ్ - కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ
అయితే ఎస్. కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. అసెంబ్లీలో బల నిరూపణ పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx
— ANI (@ANI) May 10, 2026












Click it and Unblock the Notifications