రైలెక్కి, బస్సెక్కి: చెన్నై.. అభిమానసంద్రం: సిటీలో పలుచోట్ల స్క్రీన్లు

తమిళనాడు రాజకీయాల్లో నేడు నవశకం మొదలు కాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. ఇంకాస్సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. బీజేపీ, ఏఐఏడీఎంకేలను అధికారానికి దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చిన్న పార్టీలతో దీర్ఘకాల చర్చల తర్వాత ఈ ప్రభుత్వం కొలువుదీరింది.

ముఖ్యమంత్రిగా విజయ్ తో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించిన మంత్రుల జాబితా ప్రకారం.. బస్సీ ఎన్ ఆనంద్- టీనగర్, ఆధవ్ అర్జున (విల్లివాక్కం), కేజీ అరుణ్ రాజ్ (తిరుచెంగోడు), కేఏ సెంగోట్టయ్యన్ (గోబిచెట్టిపాళ్యం), పీ వెంకటరమణన్ (మైలాపూర్), సీటీఆర్ నిర్మల్‌ కుమార్ (తిరుప్పరన్‌కుండ్రం), రాజ్‌మోహన్ (ఎగ్మోర్), టీకే ప్రభు (కారైకుడి), ఎస్ కీర్తన (శివకాశి) ఉన్నారు.

Live Telecast Across Several Chennai Locations Watch the Vijay Swearing-In as Chief Minister Today

కాగా- ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో చెన్నై జనసంద్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల నుంచి విజయ్ అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. దీంతో కోయంబేడు సహా ఇతర బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచీ వారంతా చెన్నైకి చేరుకోవడం మొదలైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే నెహ్రూ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల అనుచరులు, టీవీకే కార్యకర్తలు చెన్నై నిండిపోయింది.

అభిమానులు నేరుగా నెహ్రూ స్టేడియానికి వెళ్లే అవకాశం లేనందున వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి భారీ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. వీటితో పాటు అన్ని నియోజకవర్గాల్లో గల టీవీకే కార్యాలయాల ముందూ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడానికి వీలుగా జిల్లా కేంద్రాల్లో పార్కులు, గ్రౌండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చారు.

చెన్నైలో అన్నానగర్ టవర్ పార్క్, మెరీనా బీచ్, కోయంబేడు సీఎం‌బీ‌టీ, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, టీ నగర్ బస్టాండ్, బీసెంట్ నగర్ బీచ్, కథిపారా అర్బన్ స్క్వేర్, సెమోళి పూంజీ, వడపళని బస్ టెర్మినస్, షోలింగనల్లూర్ జంక్షన్, మాధవరం బస్ టెర్మినస్, అంబత్తూర్ ఓటీ బస్ స్టాండ్, తొండియార్‌పేట్ బస్ డిపో ఏరియాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+