పశు ప్రదర్శన: గోమూత్రం ధర లీటరకు రూ. 140

పుంగనూరు గోవులు కేవలం 2.65 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర 15 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. గోవుల ప్రదర్శనను రోజుకు ఆరు వేల మంది దాకా సందర్శిస్తున్నట్లు చెబుతున్నారు. కపిల, ఒంగోలు గిత్తలు కూడా సందర్సకులను ఆకట్టుకుంటున్నాయి. దేశీ జాతుల పాల ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చరక డెయిరీ సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.
ఆయుర్వేద వైద్యుల ప్రకారం - గోమూత్రంలో మూత్ర పిండాలను, రక్తనాళాలను శుద్ధి చేసే ఔషధ గుణాలుంటాయి. ఎర్ర రక్తకణాలను, హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణ ప్రక్రియను పెంచుతాయి. అయితే, వైద్యుల సలహా మేరకు గోమూత్రను తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications