హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీకి హైకోర్టులో చుక్కెదురు, విజ్ఝప్తి తోసివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావుకు హైకోర్టులో గురువారం చుక్కెదురైంది. ఓ పరువు నష్టం కేసులో స్వయంగా హాజరు కావాలి కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని రామోజీ రావు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టులో రామోజీ రావు స్వయంగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసేందుకు సిద్ధం కావడంతో రామోజీరావు తన పిటిషన్‌ను ఉపసంహరించుకుున్నారు.

ఈనాడు దినపత్రికలో తనపై తప్పుడు కథనం ప్రచురించినందుకు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత బత్తుల సోమయ్య ఖమ్మం జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టులో దావా వేశారు. దీన్ని విచారించిన కింది కోర్టు స్యయంగా హాజరు కావాలని రామోజీరావును, తదితరులను ఆదేశించింది. దీన్ని రామోజీ రావు హైకోర్టులో సవాల్ చేశారు. రామోజీ వయస్సు 76 ఏళ్లని, దీన్ని పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పుకున్నారు.

English summary
High Court has dismissed Eenadu Ramoji Rao plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X