హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసు: ఛార్జీషీట్ దాఖలు ఆలస్యం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి కేంద్ర కార్యాలయానికి సిబిఐ పంపిన చార్జ్‌షీట్ ప్రతికి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దీంతో సిబిఐ కోర్టులో శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. శనివారం లేదా వచ్చే నెల రెండున చార్జ్‌షీట్‌ను సిబిఐ సమర్పించ వచ్చునని తెలుస్తోంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఇటీవల న్యూఢిల్లీ వెళ్లి డైరెక్టర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. లక్ష్మీ నారాయణ ఆయనతో జగన్ ఆస్తుల కేసులో పురోగతిపై చర్చించారు. వారి నుండి అనుమతి రాగానే నెలాఖరులోగా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేస్తారని భావించారు. కానీ ఇంకా అనుమతి రాకపోవడంతో ఏప్రిల్ రెండున దాఖలుచేసే అవకాసం కనిపిస్తోంది. అలాగే ఒఎంసి కేసుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అదనపు చార్జ్‌షీట్ దాఖలయ్యే సూచనలున్నాయి.

మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సిబిఐ ముందు జగతి పబ్లికేషన్స్, అనురాగ్ జిందాల్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రతినిధులు హజరయ్యారు. ఈ కేసులో చార్జ్‌షీట్‌ను రూపొందించే పనిలోనే సిబిఐ బృందాలు నిమగ్నమయ్యాయి. అలాగే, శంషాబాద్‌లోని జిఎంఆర్ సంస్థ కార్యాలయానికి ఒక బృందం వెళ్లింది.

English summary
CBI did not get permission from higher officials till now to produce chargesheet in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X