వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పై కేంద్రం కీలక ప్రకటన!
ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) తప్పనిసరి చేస్తూ కేంద్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అధికారులు వివరించారు. ప్రధాని మోదీ ఇటీవల ఇంధన వినియోగంలో జాగ్రత్త వహించాలని, అనవసరమైన ఖర్చును తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ పై కేంద్రం వివరణ
ఈ విజ్ఞప్తిని కొందరు తప్పుగా అర్థం చేసుకొని, ప్రభుత్వం IT కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇచ్చిందని వార్తలు వ్యాపిస్తున్న వేళ దీనిపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది.ప్రధాని విజ్ఞప్తి కేవలం ప్రజలందరూ ఇంధన వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలనే సందేశం మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది ఎలాంటి నిబంధన కాదన్నారు. తప్పనిసరి ఆదేశం కాదని అధికారులు స్పష్టం చేశారు.

మోదీ పొదుపు సూత్రాల వెనుక ఉద్దేశం ఇదే
ప్రజలు స్వచ్ఛందంగా ఈ పొదుపు చర్యలను అనుసరించాలని మాత్రమే సూచించారని కేంద్రం చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు హెచ్చుతగ్గులు చెందుతున్న నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించడం దీని వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది . భారతదేశం చాలా భాగం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఇంధన వినియోగంలో పొదుపు చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసినట్టు ప్రచారం
ప్రధాని మోదీ ఇంధనపొదుపు, పర్యావరణ పరిరక్షణపై ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటారు. ఇంధనం మాత్రమే కాకుండా నీటి, విద్యుత్ వంటి వనరులను కూడా ఆదా చేయాలని ఆయన ఇప్పటికే పలుమార్లు సూచించారు. ఇటీవల ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేస్తాయని, ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉండదని కొందరు అనుకున్నారు. అయితే కేంద్రప్రభుత్వం ఇలాంటి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
అన్ని రంగాలలోనూ అవసరం అయిన పొదుపు చర్యలు
ప్రధాని మోదీ ఇంధన పొదుపు విజ్ఞప్తి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు, వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎవరిపైనా ఒత్తిడి లేదా తప్పనిసరి కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ చర్యలను అనుసరించడం ద్వారా దేశం మరింత ఆర్థికంగా బలపడుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి పొదుపు చర్యలు అన్ని రంగాల్లోనూ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications