సోనియాతో పురంధేశ్వరి, మేడం వద్దకు రాష్ట్ర నేతల క్యూ

బలరాం నాయక్, రాజయ్యలు తెలంగాణ సమస్య, కంతానాపల్లి సాగునీటి ప్రాజెక్టు నిలుపుదల గురించి అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ జనాభాలో దాదాపు 20 శాతం వరకు గల లంబాడాలకు విద్య, ఉద్యోగావకాశాలు, రాజకీయంగా అన్యాయం జరుగుతున్నందునే అసంతృప్తి పెరిగిందని సోనియాకు వివరించినట్లు బలరాం తెలిపారు. కంతనాపల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే 50శాతం తెలంగాణ బాగుపడుతుందని వివరించినట్లు చెప్పారు. అన్ని వర్గాల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు ఆగవని చెప్పానని అన్నారు. మరో ఎంపి రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక జరిగిన తీరును వివరించినట్లు చెప్పారు. కంతనాపల్లి ప్రాజెక్టు పక్కన పెట్టవద్దని చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications