వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌కు కిరణ్‌పై బొత్స ఫిర్యాదు: ఫోన్ చేసి నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

otsa Satyanarayana
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మద్యం సిండికేట్లలో తనను ముఖ్యమంత్రి ఇరికించడానికి ప్రయత్నించారని అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి ఆఘమేఘాల మీద బొత్స ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఎడాపెడా వాయించినట్లు ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.

వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలయ్యేంత వరకూ ఓపిక పట్టవలసిందిగా బొత్సను ఆజాద్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో తన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని ఎసిబి సిట్ అదనపు డైరెక్టర్ సిఐని వేధించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకు మధ్య విభేదాలు మరింత పెరిగాయి. శ్రీనివాస రెడ్డి వ్యవహారం వెనక ముఖ్యమంత్రి ఉన్నారని అనుమానించిన బొత్స ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ముఖ్యమంత్రిపై బొత్స తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. తనకు ఆ వ్యవహారం తెలియదని ముఖ్యమంత్రి ఎంత చెప్పినా బొత్స వినలేదని అంటున్నారు. ఉప ఎన్నికల కోసం పార్టీ నేతలందర్నీ కలుపుకొని, ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రే పార్టీలో నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆజాద్‌కు బొత్స చెప్పినట్లు తెలిసింది.

కాగా, ఉప ఎన్నికలను జూన్‌లోపే నిర్వహించాలని తాము భావిస్తున్నామని, అందుకు తగిన వ్యూహరచనను ప్రారంభించామని, ఎంపీలతో చర్చలు జరుపుతున్నానని బొత్సకు ఆజాద్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. "ఎన్నికల్లో కలిసి పనిచేయాలని సీఎంకి చెబుతాం. మీరు ఈ విషయం రచ్చచేయకుండా జూన్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగండి'' అని బొత్సను ఆజా ద్ బుజ్జగించినట్లు తెలిసింది.

English summary
According to news reports - PCC president Botsa Satyanarayana has lashed out at CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X