జగన్ కేసులోనూ ఆచార్య: మిగతా నిందితులెవరు?

వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు శరత్ చంద్రా రెడ్డి ట్రిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరో నిందితుడు శ్రీనివాస రెడ్డి హెటిరో డ్రగ్స్ సంస్థ డైరెక్టర్. మరో నిందితుడు నిత్యానంద రెడ్డి అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్. ఆ సంస్థలను కూడా సిబిఐ నిందితులుగా చేర్చింది. నిందితులుగా చేర్చిన జగతి పబ్లికేషన్స్ వైయస్ జగన్‌కు చెందిందనే విషయం తెలిసిందే. జననీ ఇన్‌ఫ్రా కూడా ఆయనకు సంబంధించిందేనని చెబుతారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఒక్కరే అరెస్టయ్యారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్‌లను) మంజూరు చేసినందుకే వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని సిబిఐ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో లేని పేర్లు సిబిఐ చార్జిషీట్‌లోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications