చిరంజీవి వర్గం భేటీ: తిరుపతి టికెట్ కోసం ఒత్తిడి

స్థానికేతరులకు కాంగ్రెసు టికెట్ ఇవ్వకూడదని, తమకే టికెట్ లభించేలా చూడాలని వారు చిరంజీవిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జయచంద్రా రెడ్డి వంటి నాయకులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెసు పార్టీ తమను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే, తాము కాంగ్రెసు పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నామని వారంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత ప్రజారాజ్యం శ్రేణులు తెలుగుదేశం పార్టీలోకి, వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తున్నాయనే ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని, ప్రజారాజ్యం శ్రేణులన్నీ కాంగ్రెసులోని ఉన్నాయని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని అంటున్నారు. చిరంజీవి ఎవరికి తిరుపతి టికెట్ ఇప్పించినా తాము గెలిపించడానికి పనిచేస్తామని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications