భారీ శ్రీరాముని విగ్రహంతో వైభవంగా శోభాయాత్ర

ఈ కార్యక్రమానికి కేవలం నగరం, రాష్ట్రంలోని భక్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చారు. ఇందు కోసం రెండు వేల మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూవాహిని సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇరవై వేలకు పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని తెలుస్తోంది. క్రమంగా యాత్రలో పాల్గొంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది.
కాగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీకోదండరామాలయం భక్తులతో కిటకిటలాడింది. రాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలు శ్రీరామ కల్యాణ శోభను సంతరించుకున్నాయి. ఆయా దేవాలయాల్లో వైభవంగా కల్యాణం నిర్వహించారు. సీతారాముల కల్యాణం చూసేందుకు దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications