హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిపాజిట్ కోల్పోయా, గెలిపించే సత్తా నాకు లేదు: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: డిపాజిట్ కోల్పోయిన తనకు ఇతర నియోజకవర్గాల్లో గెలిపించే సత్తా లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ మూడో స్థానానికి వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదన్నారు. రాజీనామా లేఖను తన జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పారు.

అధిష్టానం సూచనల మేరకు తాని రాజీనామా లేఖను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 2014 వరకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ కూడా తమిళనాడు పరిస్థితి నెలకొంటుందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసే అవకాశం లేదన్నారు.

జగన్‌కు ఓసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. జగన్‌కు సరైన సలహాదారు లేకపోవడమే రాజకీయంగా ఆయనకు లోటు అని డిఎల్ అన్నారు. వచ్చే కడప ఉప ఎన్నికలకు బాధ్యత తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఎన్నికలలో గెలవాలంటే నిజాయితీగా ప్రయత్నించాలని ఆయన సూచించారు.

1995 నుండి జరిగిన భూకేటాయింపులపై శాసనసభలో చర్చ జరగాలని డిఎల్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో భూకేటాయింపులపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. వాటి వెనుక ఉన్న ఒప్పందాలు వెలికి తీయాలన్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో వైన్ షాపులు, రేషన్ దుకాణాలపై పూర్తి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Minister DL Ravindra Reddy said that I lost my deposit in Kadapa bypolls. He accused that AP will became like Tamilnadu if Kiran Kumar Reddy is CM till 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X