వెలుగు చూస్తున్న తారా లీలలు, బెదిరించి రొంపిలోకి

తారా చౌదరి యువతులకు తెలియకుండా స్పై ఆపరేషన్ నిర్వహించేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లో ఓ రహస్య కెమెరాను పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. రహస్య కెమెరాల ద్వారా తన వద్దకు వచ్చిన యువతులను నగ్నంగా ఫోటోలు తీసి వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార కూపంలోకి దింపి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెదిరింపులకు లొంగని యువతుల చిత్రాలను ఇంటర్ నెట్‌లో పెడతానని తారా చౌదరి బెదిరించేదని తెలుస్తోంది. బెదిరింపుల ద్వారా కొందరిని వ్యభిచార కూపంలోకి లాగిన తారా, మరికొందరి నుండి లక్షల రూపాయల డబ్బులు కూడా వసూలు చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. బెదిరింపులకు లొంగని పలువురి ఫోటోలు ఇంటర్ నెట్లో పెట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈమె బాధితుల్లో ప్రముఖులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. తారా బాధితుల్లో రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు కూడా ఉన్నారట.
కాగా యువతులను మోసం చేస్తున్న తారా చౌదరిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెను, ఆమె సన్నిహితుడిని పోలీసులు ఆదివారం రిమాండుకు పంపించారు. విజయవాడకు చెందిన తార చౌదరి తన సన్నిహితుడితో కలిసి బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో విశాలమైన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నేళ్లుగా ఉంటోంది. ఇటీవల ఓ యువతిని నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచారం నిర్వహించడంతో వారి నుంచి తప్పించుకున్న యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications