చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంపై 'తిరుపతి' ప్రెజర్: చిరు, గల్లా వర్గం పోటా పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi and Galla Aruna Kumari
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ సీటు కోసం చిరంజీవి వర్గం, మంత్రి గల్లా అరుణ కుమారి వర్గం నేతలు జోరుగా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సీటును ప్రజారాజ్యం పార్టీ కేడర్‌కే ఇవ్వాలని చిరంజీవి వర్గం నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం ఉదయం తిరుపతి వెళ్లారు. వారు పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తిరుపతి అసెంబ్లీ స్థానం ఎవరికి కేటాయించాలనే అంశంపై జోరుగా వారితో సిఎం చర్చిస్తున్నారు. అయితే టిక్కెట్‌ను తమకే ఇవ్వాలని చిరంజీవి వర్గం పట్టుబడినట్లుగా సమాచారం. మరోవైపు మంత్రి గల్లా అరుణ కుమారి వర్గం నేతలు కూడా తమ నేతకే టిక్కెట్ ఇవ్వాలని కోరారని సమాచారం. గల్లా జయదేవ్‌కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారని తెలుస్తోంది. మరో ఇద్దరు అభ్యర్థులు కూడా టిక్కెట్ కోసం సిఎంను అభ్యర్థించారని సమాచారం.

ఎవరికే వారే మాకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని సిఎంకు చెప్పారని తెలుస్తోంది. టిక్కెట్ కోసం పోటీ ఉండటంతో.. సిఎం గెలిచే వారికే టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కార్యకర్తలు, నాయకుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కాగా చిరంజీవితో కలిసి కిరణ్ అభ్యర్థి ఎన్నిక గురించి రావడంతో చిరుకు ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎన్నిక చేయాలని సిఎం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పద్మావతి అతిథి గృహంలో ఆయన తిరుపతి అభ్యర్థిపై కసరత్తు చేశారు.

అంతకుముందు ఆయన డిజిపి దినేష్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. తిరుపతిలో రూ.50 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి, మంత్రి గల్లా అరుణ కుమారి తదితరులు పాల్గొంటారు. కిరణ్ రోజంతా బిజిబిజిగా గడుపుతారు.

English summary

 Chiranjeevi camp and Galla Aruna Kumari camp pressured CM Kiran Kumar Reddy for Tirupati ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X