హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో బాబు టార్గెట్ జగన్, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రభుత్వం వ్యతిరేక ఆందోళనలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, గగన్‌పాడులో ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోపాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు.

రాజధాని హైదరాబాదులో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. హైదరాబాదులోనే ఇలా ఉంటే గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. నాలుగేళ్ల వరుస కరవులోనూ ఎలాంటి కోత లేకుండా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా రావాలంటే విద్యుత్ సరఫరా కీలకమన్నారు. గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూనే ఉన్నారని విమర్శించారు. సేవా పన్ను పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.

విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.17 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైనా ఆయన మండిపడ్డారు. జగన్ తులసి మొక్క కాదని గంజాయి మొక్క అన్నారు. ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఛార్జీలు పెంచుతోందన్నారు. మాకెందుకులే అని అనుకుంటే బతకటం కష్టమన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్ సంక్షోభం అన్నారు.

జగన్ ఐదేళ్లలో తన తండ్రి అధికారం అడ్డుగా పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు. ఆయనకు దమ్ముంటే 2004కు ముందు తన ఆస్తి ఎంత ఇప్పుడు ఎంతో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా విద్యుత్ పెంపుని నిరసిస్తూ చంద్రబాబు గగన్‌పాడు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు బాబును, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu targeted YSR Congress Party chief YS Jaganmohan Reddy again. He participated in a dharna at Gaganpahad protesting against power taarif hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X