హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దివంగత సిఎంతో దిగిన ఫోటోతో తారా బెదిరింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
హైదరాబాద్: అమాయక యువతులను ఆకర్షించి వ్యభిచార రొంపిలోకి దింపిన తారా చౌదరి కస్టడీ విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. తారా చౌదరిని తమ కస్టడీకి అప్పగించమని బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. ఇరువైపుల వాదనల అనంతరం కోర్టు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని తారా తరఫు న్యాయవాదికి సూచించింది. అందుకు తారా తరఫు న్యాయవాది కోర్టును సమయం కోరారు.

ఈ సందర్భంగా పోలీసులు తారా చౌదరి గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తారా దివంగత ముఖ్యమంత్రి ఒకరితో ఫోటోలు దిగి వాటిని చూపించి పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా కనుగొన్నట్లు తెలుస్తోంది. అది దివంగత వైయస్‌ది అని తెలుస్తోంది. ఈమెకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసు అధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తమకు దొరికిన వీడియోలు, ఫోన్ల ద్వారా పోలీసులు కనుగొన్నారని అంటున్నారు. ఈమె బారిన చాలామంది పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

పలువురికి తెలియకుండా వీడియో రికార్డ్ చేసి, ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపించి ఆమె ఇతరులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లలో డబ్బులు గుంజినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బారిన పలువురు ప్రముఖులు కూడా పడినట్లుగా తెలుస్తోంది. దివంగత సిఎంతో దిగిన ఫోటోలతోనూ ఇతరులను బెదిరించారట. కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో చాలామంది వీడియోలను తారా రికార్డ్ చేసినట్లుగా కనుగొన్నారు.

తారను విచారిస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటపడతాయని, ఆమెను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వారని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు. విచారణ వాయిదా పడింది. కాగా తారాకు చెందిన హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

English summary
Banjara Hills Police revealed sensational things about Tara Chowdhary, arrested in a case. She blackmailed some people with late chief minister and VIPs photos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X