వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా గుర్రు!: కలవకుండానే కిరణ్ తిరుగు ముఖం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Sonia Gandhi
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవకుండానే న్యూఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్ సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సమీక్ష నిర్వహిస్తున్నారు.

దీంతో యుపి ఫలితాల సమీక్షలు ఉన్నందున అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రికి నేతల ద్వారా సోనియా గాంధీ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి అధినేత్రిని కలవకుండానే ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అధినేత్రితో భేటీ కాలేదు. వారిద్దరూ కేవలం గులాం నబీ ఆజాద్ వంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

బొత్స, కిరణ్‌ల మధ్య ఉన్న విభేదాలపై సోనియా గాంధీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఆమె వారితో భేటీ అయ్యేందుకు నిరాకరించి ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఆమె మాత్రం బొత్స, కిరణ్‌లకు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ద్వారా చెప్పించారని అంటున్నారు. విభేదాలపై వారికి అధిష్టానం హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.

కాగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బొత్స కూడా వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో భేటీ కాకుండానే తిరుగు ముఖం పడుతున్నారు. కాగా వేరువేరుగా ఢిల్లీ వెళ్లిన బొత్స, కిరణ్‌లు హైకమాండ్ క్లాస్‌తో దారిలోకి వచ్చారని అంటున్నారు. ఇరువురు కలిసి బుధవారం రాత్రి ఒకే కారులో ప్రయాణించడం, ఎపి భవనంలో గురువారం ఉదయం బాబూ జగ్జీవన్ రామ్‌కు కలిసి నివాళులు అర్పించడాన్ని బట్టి ప్రస్తుతానికి పార్టీ నేతల మధ్య విభేదాలు సమసిపోయినట్లేనని భావిస్తున్నారు.

English summary
CM Kiran Kumar Reddy did not get AICC president Sonia Gandhi appointment. He was returned to Hyderabad from AP Bhavan. It is said that Sonia is very angry with CM Kiran and PCC chief Botsa Satyanarayana for differences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X