రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు: హర్షకుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ప్రశ్నించారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీట్ దాఖలై వారం రోజులవుతోందని, అయినా ఇప్పటి వరకు జగన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన అన్నారు.

దోచుకోవడం తప్ప మరో చరిత్ర లేని వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధితో పోల్చుకోవడం సిగ్గు చేటని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. కోట్లకు కోట్లు దోచుకున్న జగన్‌పై చార్జి షీట్ ఇప్పటికే దాఖలు చేసినందున ఆలస్యం చేయకుండా జగన్‌ను అరెస్టు చేయాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఇతరులపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు,

వైయస్ జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో గురువారంనాడు ర్యాలీ జరిగింది. గడప గడపకూ జగన్ అవినీతి అని నినాదాలు గల బ్యానర్లు పట్టుకుని వారు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు.

వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో మార్చి 30వ తేదీన సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిబిఐ వైయస్ జగన్‌ను మొదటి నిందితుడిగా చేర్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని మాత్రమే అరెస్టు చేసింది. త్వరలో సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

English summary
Congress MP Harsha Kumar demanded arrest YSR Congress president YS Jagan in assets case immediately. He questioned CBI that why YS Jagan has not been arrested, though chargesheet was filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X