తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి మంత్రి పదవి హామీ లేదు: రామచంద్రయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
తిరుపతి: తమ నేత చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెసు అధిష్టానం హామీ ఇవ్వలేదని దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవితో కాంగ్రెసు నాయకత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. మొదటి నుంచి చిరంజీవి తరఫున రామచంద్రయ్యనే మాట్లాడుతున్నారు.

చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి, వచ్చే ఉప ఎన్నికలకు సంబంధం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, లోకసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి పార్టీ ప్రచారానికి వాడుకోవాలనేది కాంగ్రెసు నాయకత్వ ఉద్దేశంగా చెబుతూ వస్తున్నారు. దీనివల్ల ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ప్రజారాజ్యం విలీనం సమయంలో కాంగ్రెసు నాయకత్వం ఇచ్చిన హామీ మేరకు చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఆయన తిరుపతి శాసనసభా స్థానానికి రాజీనామా చేశారు. చిరంజీవిని ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని కేంద్ర మంత్రిగా తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెసు బలోపేతానికి వాడుకోవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది.

అనంత స్వర్ణమయ పథకానికి ఆదికేశవులు నాయుడు ఇప్పటికే బంగారాన్ని సేకరించారని, ఇక తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలిదే తుది నిర్ణయమని మంత్రి సి.రామంచద్రయ్య చెప్పారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. దేవాలయ భూములను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

English summary
Endowment minister C Ramachandraiah said that Congress high command has not made any promise to Mega star Chiranjeevi on Union ministry. Chiranjeevi has been elected Rajyasabha recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X