మాటీవీలో వాటాలు కొనుగోలు చేసిన సోనీ టీవీ

మాటీవీ నెట్‌వర్క్ ప్రధాన ప్రమోటర్స్ ఎన్ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున్, అల్లు అరవింద్. వారు కంపెనీ ఈక్విటీలో 95 శాతాన్ని కలిగి ఉన్నారు. ఎస్‌పిటి, మాటీవీ ఒప్పందం ఇరు సంస్తల వ్యూహాత్మక అవకాశాలను మెరుగు పరుస్తుందని, భారతదేశవ్యాప్తంగా ప్రేక్షకులను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుందని, ఈ ఒప్పందం ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నామని సోనీ పిక్చర్స్ భారత ఆపరేషన్స్‌ను చూస్తున్న ఎంఎస్ఎం ఇండియా సిఇవో మంజిత్ సింగ్ అన్నారు.
ప్రముఖ తెలుగు సాధారణ వినోదాత్మక చానెల్‌గా నడుస్తున్న తమ సంస్థపై ఎస్‌పిటి విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందని, ప్రాంతీయ టీవీ చానెళ్లకు ఉన్న భవిష్యత్తుకు అద్దం పడుతోందని మాటీవీ చైర్మన్ ఎన్ ప్రసాద్ అన్నారు. వ్యూహాత్మక భాగస్వామిగా సోనీ ముందుకు రావడం వల్ల టీవీ ప్రేక్షకులు కార్యక్రమాల్లో నాణ్యతను ఆశించవచ్చునని, మాటీవీ నెట్‌వర్క్ చానెళ్లను కుటుంబ సమేతంగా ఇష్టపడ్తారని ఆయన అన్నారు.
చిరంజీవి ఏమంటున్నారు?
ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక ఒప్పందంపై చిరంజీవి స్పందించారు. ఎన్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో మాటీవీ గత కొద్ది సంవత్సరాలాల్లో మాటీవీ సమర్థతను పెంచుకుంటూ వచ్చిందని, నాలుగు చానెళ్లతో తెలుగు జిఇసి నెట్‌వర్క్ ప్రముఖ చానెల్‌గా ఎదిగిందని ఆయన అన్నారు. తెలుగులో ఈ కొత్త పరిణామం వల్ల కొత్త అభివృద్ధి దిశగా సాగుతుందని సంస్థ డైరెక్టర్ ప్రమోటర్స్ నాగార్జున, అల్లు అరవింద్ అన్నారు. భారత మీడియా పరిశ్రమలోని అత్యుత్తమ సంస్థల్లో మాటీవీ ఒక్కటని మాటీవీ డైరెక్టర్ సి. రామకృష్ణ అన్నారు.
మాటీవీ గురించి
మా టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్ 2001లో ఏర్పడింది. దాని ప్రధాన జిఇసి చానెల్ మాను 2002లో ప్రారంభించారు. రెండో చానెల్ మా మ్యూజిక్‌ను 2008లో స్థాపించారు. మామావీస్ 2011లో ప్రారంభమైంది. పట్టణ ప్రేక్షకులను, యువ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మరో జిఇసి తెలుగు టీవీ చానెల్ మా గోల్డ్‌ను 2012లో ప్రారంభించారు. నాలుగు చానెళ్లతో మాటీవీ తెలుగులో ప్రధానమైన టీవీ చానెల్‌గా రూపుదిద్దుకుంది.
మాటీవీ 700 చిత్రాల శాటిలైట్ ప్రసార హక్కులను సంపాదించింది. వీటిలో చాలా వరకు తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలే. ప్రమోటర్లలో చిరంజీవి, నాగార్జున తెలుగులో ప్రముఖ హీరోలు కాగా, అల్లు అరవింద్ నిర్మాత. కార్యక్రమాల రేటింగ్ విషయంలో ప్రధానమైన జిఇసి మా దేశంలోని టాప్ 20 చానెళ్లలో ఒక్కటిగా స్థానం సంపాదించుకుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications