నేతలు వాడుకున్నారు, గుట్టు విప్పుతా: తారా చౌదరి

తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె చెప్పింది. కావాలనే తనను వ్యభిచారం కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. తనకు చంపుతానని పలు బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని తెలిపింది. తాను అమాయకురాలిని అని పేర్కొంది.
తాను సినీ ఆర్టిస్టును కాబట్టి సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటాయని తెలిపింది. తనను కొందరు రాజకీయ నేతలు వాడుకున్నారని చెప్పింది. సమయం వచ్చినప్పుడు వారి గుట్టు బయట పెడతానన్నది. తాను అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి లాగాననే ఆరోపణలను ఆమె ఖండించింది. తాను ఏ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి లాగలేదని తెలిపింది. డిజిపి, హోంమంత్రి రక్షణ కల్పిస్తే అన్ని విషయాలు బయట పెడతానని చెప్పింది.
తన లాప్‌టాప్‌లో ఏమీ లేదని తెలిపింది. తాను నిర్దోషినని, సిబిఐ విచారణ జరిగితే తాను కేసులోంచి బయటపడతాననే నమ్మకం ఉందన్నారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రాణభయముందని చెప్పింది. పోలీసు విచారణపై తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు.
తాను హోంమంత్రి, డిజిపిని రక్షణ కోరతానని చెప్పింది. సిబిఐ విచారణలో తాను అన్నీ చెబుతానని తెలిపింది. లక్ష్మీ అనే అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పింది. తనను చాలా బ్యాడ్‌గా చిత్రీకరిస్తున్నారని ఆవేద చెందారు. ఇదంతా కావాలనే చేస్తున్నారని తెలిపింది. సిబిఐ విచారణ చేస్తే దీని వెనుక కుట్రదారులు ఎవరో బయటకు వస్తుందన్నారు.
కాగా ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట తారా చౌదరి అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతుందనే ఆరోపణల కారణంగా ఇటీవల ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఆమెను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.
తమ కస్టడీకి తారా చౌదరిని నాలుగు రోజులు ఇవ్వాలని, గుట్టు విప్పుతామని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు తారా చౌదరిని, ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం నుండి ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, సోమవారం నుండి తారను తీసుకొని విచారిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications