బొత్స, చంద్రబాబులపై వైయస్సార్ కాంగ్రెసు నేత ఫైర్

Srikanth Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాజా మాజీ శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బొత్స సత్యనారాయణ తన జిల్లాను అస్తవ్యస్తం చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చంద్రబాబు, ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావు కలిసి అస్తవ్యస్తంగా చేయడానికి వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిజాయితీ గల అధికారిని బదిలీ చేసి ప్రమోషన్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

రైతుల పక్షాన నిలిచినందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆయన అన్నారు. తమ పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు ధర స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే రైతులు సమస్యలు లేకుండా ఉండేవారని అన్నారు.

రానున్న 18 శాసనసభా స్థానాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై విమర్శలను ఉధృతం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో కాంగ్రెసు పార్టీని అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+