తెలంగాణ కోసం మరో ఆత్మహత్య, ఆటో డ్రైవర్ మృతి

తెలంగాణ కోసం విద్యార్థులు, రైతులు, ఆటోడ్రైవర్లు చనిపోతున్నారని, ఇప్పటికైనా తెలంగాణ నాయకులు కళ్ళు తెరిచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని లేఖలో చెప్పాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ గిరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని.. లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇంట్లో సోదాలు చేయగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు, ఆసుపత్రి రిపోర్టులు లభించాయి. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగానే గ్రామస్థులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు.
కాగా, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతుడి బంధువులు తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మేధావులు ఎంతగా విజ్ఞప్తులు చేసినా తెలంగాణలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల ఉప ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోవడం మళ్లీ ప్రారంభమైంది. రాజకీయ నాయకులను తప్పు పడుతూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications