తారా చౌదరి తారంగం: పొంతన లేని స్టోరీలతో తికమక

Tara Choudary
హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి గడియకో మాట మారుస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఆమె పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. పొంతనలేని కథనాలు చెబుతూ పోలీసులను తికమక పెడుతున్నట్లు తెలుస్తోంది. తాను అమాయకురాలినని, తనకు ఏమీ తెలియదని చెబుతూ కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మూడో రోజు మంగళవారం కూడా ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె నుంచి సమాచారం పెద్దగా రాబట్టలేకపోయారని అంటున్నారు. ఓ పారిశ్రామికవేత్త హత్యకు ఆమె సుపారీ ఇచ్చినట్లు వార్తలు రావడంతో వాటిని ధ్రువీకరించుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. తనను చంపేందుకు ఎవరో సుపారీ ఇచ్చారని, తనకు భయమేస్తోందని ఆమె చెప్పిందని అంటున్నారు.

ఎవరినీ చంపే ఉద్దేశం తనకు లేదని తారా చౌదరి చెప్పిందని అంటున్నారు. అయితే, ఓ వ్యక్తిని చంపేందుకు ఐదుల లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు అంగీకరించిదట. కేవలం ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకే పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టినట్లు వార్తలు వచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త నర్సింహులును తారా చౌదరి బ్లాక్ మెయిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

చంపేస్తానని బెదిరించడమే కాకుండా పడుపు వృత్తి వ్యవహారాలను పోలీసులకు చెబుతానని అతను హెచ్చరించాడని అంటున్నారు. దాంతో అతన్ని చంపేందుకు తారా చౌదరి ఐదు లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే రంకగా రాయలసీమకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడి కుమారుడిని కూడా ఆమె బెదిరించిందని అంటున్నారు. అయితే, పార్టీ నాయకులకు తానే పార్టీ ఫండ్ ఇచ్చేదాన్నని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

తారా చౌదరి నివాసంలో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వారికి ఆమె ఇంట్లో బస్తా మద్యం సీసాలు, కొన్ని విలువైన పత్రాలు, సిడీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడివని అడిగితే తన భర్త ప్రసాద్‌తో కలిసి తాను రోజూ తాగేదాన్నని ఆమె చెప్పిందని అంటున్నారు. సిబిఐతో దర్యాప్తు జరిపించాలని తారా చౌదరి డిమాండ్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+