జగన్ ఇప్పటి వరకు చెప్పలేదు: మంత్రి దానం నాగేందర్

Danam Nagender
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తన పార్టీ మానిఫెస్టో, అజెండా ప్రజలకు చెప్పలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ గురువారం విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసమే పార్టీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఆయన పార్టీ ఏర్పాటు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం కాదని అన్నారు.

ప్రారంభంలో పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెసు జెండాతో గెలిచిన జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసు పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ విమర్శలు మానుకోవాలని సూచించారు. తన పార్టీ నేతలకు కూడా దానం నాగేందర్ సూచనలు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం కాంగ్రెసు పార్టీ నేతలు ఇకనైనా మానుకోవాలని కోరారు. వైయస్‌ను విమర్శిస్తే పార్టీకే నష్టమన్నారు. వైయస్‌ను తిడితే కాంగ్రెసు పట్ల ప్రజలకు విశ్వసనీయత పోతుందన్నారు. ఆయనను విమర్శించాలా వద్దా అనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. గాలికి గెలిచిన వాళ్లే వైయస్‌ను విమర్శిస్తారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మేం విఫలమయ్యామని ఆయన చెప్పారు.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయానికి జగన్ తూట్లు పొడుస్తున్నారని దానం మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను సేకరించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+