వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ టు లక్నో: తండ్రి పిస్తోలుతో కాల్చుకున్న కూతురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lucknow Map
లక్నో: డిప్యూటీ ట్రాన్సుపోర్టు కమిషనర్‌గా పని చేస్తున్న తండ్రి పిస్టోలుతో ఓ కూతురు కాల్చుకొని మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇరవయ్యారేళ్ల ఆ యువతి బుధవారం ఉదయం పిస్టోల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. లక్నోలోని అలీగంజ్‌లోని కె సెక్టార్‌లో ఇది జరిగింది. మృతి చెందిన కూతురును అలక్ష్య సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

ఆమె తండ్రి శ్రీ కృష్ణ సింగ్. బుధవారం ఉదయం 5.30 గంటల నుండి 11.00 గంటల ప్రాంతంలో ఆమె కాల్చుకుంది. అలక్ష్య న్యూఢిల్లీలోని మోజాయీ ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్ల జపనీస్ కోర్స్ నేర్చుకుంటోంది. అయితే డిప్రిషన్‌ సమస్య కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఫిబ్రవరిలో లక్నోకు తీసుకు వచ్చారు. ఈమెకు డిప్రెషన్‌కు సంబంధించిన చికిత్స చేయిస్తున్నారు.

చికిత్స చేయిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆమె రివాల్వర్‌తో కాల్చుకున్న స్థలంలో ఆమె సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అలక్ష్య.. డియర్ పేరెంట్స్, మరో దారి లేక నేను వెళ్లి పోతున్నానని, మిమ్మల్ని నేను మరింత బాధించదల్చుకోలేదని, ఈ బాధాకరమైన జీవితం నుండి బయట పడాలనుకుంటున్నానని, దేవుడు తనను పిలుస్తున్నాడని ఆమె తన సూసైడ్‌లో పేర్కొంది.

అంతేకాకుండా తన మృతికి ఎవరూ కారకులు కారని, తన ఆత్మ శాంతించాలంటే ఎవరినీ తప్పు పట్టవద్దని అలక్ష్య సూసైడ్ నోట్‌లో కోరింది. చివరలో లవ్ యు మామ్, డాడ్ అని రాసింది. ఆమె సాధారణంగా పదకొండు గంటలకు లేస్తుంది. దీంతో ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులు ఎవరూ ఆమె గదికి వెళ్లలేదు.

పదకొండు గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఆమె గదిలోకి వెళ్లారు. అక్కడ అలక్ష్య విగత జీవిగా పడి ఉండటాన్ని చూశారు. ఆమె తన తండ్రికి చెందిన ఎస్.32 లైసెన్సుడ్ రివాల్వర్‌తో తలపై కాల్చుకుంది. కాగా మరో ఘటనలో ఇరవయ్యేళ్ల ఆశిష్ కుమార్ అనే యువకుడు బంతారాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ అక్కడ లేదు.

English summary

 The 26-year-old daughter of a deputy transport commissioner shot herself dead with her father's revolver in Sector K of Aliganj on Wednesday morning. The girl was identified as Alakshya Singh, daughter of Sri Krishna Singh. The incident took place between 5.30am and 11am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X