ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన ఆంధ్ర శాస్త్రవేత్తలు

హైదరాబాదులోని ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు సునామీపై ప్రపంచాన్ని అప్రమత్తం చేశారు. భూకంపం తర్వాత చిన్నపాటి సునామీ అలలు కనిపించాయని, అయితే నిమిషాల్లోనే అవి తగ్గిపోయాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ షినోయి చెప్పారు. సునామీ రాదని నిర్ధారించుకున్న వెంటనే హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాదులోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్, చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓసియన్ టెక్నాలజీ సునామీని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఆ సాంకేతికక పరిజ్ఝానం సముద్ర ఉపరితలంలో సంభవించే మార్పులను గుర్తిస్తుంది. సుమద్రం గర్భంలోని ఉష్ణోగ్రతను, ఒత్తిడిని, వాయు వేగాన్ని, దాన్ని దిశను ఆ సాంకేతిక పరిజ్ఝానం పట్టుకుంటుంది.
హైదరాబాద్, చెన్నై శాస్త్రవేత్తలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సునామీ ముప్పు సమాచారాన్ని ఐటిఇడబ్ల్యుసికి అందించారు. అది సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం ప్రభావం గురించి, తీవ్రత గురించి, సునామీ వచ్చే అవకాశాలు గురించి హైదరాబాదులోని శాస్త్రవేత్తలు బుధవారం ఎప్పటికప్పుడు అందిస్తూ వెళ్లారు.












Click it and Unblock the Notifications